TDP-JSP: రాజమండ్రిలో లోకేష్, పవన్ కీలక భేటీ.. సీట్ల లెక్కలు తేల్చేందుకేనా?

రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సీట్ల లెక్కలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

New Update
TDP-JSP: రాజమండ్రిలో లోకేష్, పవన్ కీలక భేటీ.. సీట్ల లెక్కలు తేల్చేందుకేనా?

TDP- JSP Meeting in Rajahmundry: రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొత్తు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఉమ్మడి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు.. తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Also Read: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు

లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయడు. పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని, మహేంద్ర రెడ్డిలు పాల్గొన్నారు.

అంతకముందు రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులతో నారా లోకేశ్ సమావేశమై జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలుపై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు లోకేశ్ చేరుకున్నారు. అలాగే రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక భేటీ అయ్యాక లోకేశ్, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి ఇప్పటికే 44 రోజులు గడిచాయి. బాబు అరెస్ట్‌ అయిన రెండో నాడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్‌ తెలిపారు. ఎక్కడైతే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయో అక్కడి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఉమ్మడి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు.. తదితర అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇది. భేటీ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisment
తాజా కథనాలు