TDP-Janasena Manifesto: త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక అంశాలివే!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.

New Update
TDP-Janasena Manifesto: త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక అంశాలివే!

టీడీపీ, జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసింది. 11 అంశాలతో టీడీపీ(TDP), జనసేన (Janasena) ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఉండనున్నట్లు నేతలు తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల చేస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో మినీ మేనిఫెస్టో ఉంటుందని వెల్లడించారు. ఉమ్మడి మినీ మేనిఫెస్టో తో త్వరలోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఉండాలని రాజమండ్రి లో టీడీపి, జనసేన నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోను ఇప్పటికే రిలీజ్ చేశామన్నారు. టీడీపీ 6 అంశాలను ఇప్పటికే ఇచ్చామన్నారు. జనసేన 5 అంశాలను చెప్పిందని తెలిపారు. దీంతో మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. రెండు పార్టీల పెద్దలు దీనిని పరిశీలించి.. మినీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: తెలంగాణపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. ఆ నినాదంతో ప్రచారం హోరెత్తించాలని ప్లాన్?

సౌభాగ్యపదం అనే హామీ జనసేన ప్రతిపాదించిందన్నారు. సాధారణ రైతులతో పాటు ఆక్వా రైతుల ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు. బీసీలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉచిత ఇసుక కూడా ఉంటుందన్నారు. వలసల నివారణకు కార్మికులు కోసం ప్రత్యేక పథకం ఉంటుందన్నారు. వివిధ వర్గాలు, సంఘాల నుండి వచ్చే వినతులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మార్చాల్సిన అవసరం ఉందని యనమల అన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్రంగా నష్టం చేసిందన్నారు. టీడీపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మీద చంద్రబాబు, పవన్ ఫొటోలు ఉంటాయన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో తో టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్తుందన్నారు. జనసేన ప్రతినిధి ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. జగన్ నవరత్నాలు అంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగులు, యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉపాధి పెంచాలని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. పారిశ్రామికంగా మరిన్ని అవకాశాలు తీసుకూరావాలని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు.

Advertisment
తాజా కథనాలు