No Tickets For TDP Senior Leaders: టీడీపీ - జనసేన అభ్యర్థుల మొదటి జాబితా (MLA Candidate List) విడుదలైంది. ఉండవల్లి వేదికగా టీడీపీ అథినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేనుందని తెలిపారు. బీజేపీ కలిసివస్తే తగిన నిర్ణయాలు, తగిన సమయంలో తీసుకొంటామని పేర్కొన్నారు.
Also Read: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నోరో వైరస్.. ఎంత ప్రమాదకరమైనది..దాని లక్షణాలేంటి!
ఇదిలా ఉండగా, ఈసారి చంద్రబాబు (Chandrababu) టీడీపీలో సీనియర్లకు మొండి చేయి చూపించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వారికి టిక్కెట్ ఇవ్వనట్లు కనిపిస్తోంది. తొలి జాబితాలో సీనియర్లు దేవినేని ఉమ (Devineni Uma), గంటా, చింతమనేని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోడె ప్రసాద్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, బీకె పార్ధసారధి వారికి టిక్కెట్ దక్కలేదు.
Also Read: అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు..
తెనాలిలో జనసేన (Janasena) నుంచి నాదెండ్ల మనోహర్‌కు సీటు కేటాయించడంతో టీడీపీ ఆలపాటి రాజాకు సీటు లేనట్లేనని అర్థం అవుతోంది. అనంతపురంలో పరిటాల ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇచ్చారు. పరిటాల శ్రీరామ్‌కు (Paritala Sriram) అధిష్టానం సీటు ఇవ్వలేదని తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమకు సీటు ఇవ్వలేదని పలువురు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.