Sajjala: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

షర్మిలపై సజ్జల రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాఫియా ముఠా టీడీపీ, చంద్రబాబుతో కలిసి పనిచేస్తుందన్నారు. ఆమెకు స్క్రిప్ట్ ఎక్కడ నుంచి వస్తుందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. వారంతా నోటాతో పోటీ పడేందుకు జత కట్టారని విమర్శించారు.

New Update
Sajjala: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

Sajjala Comments On Chandrababu & Sharmila: టీడీపీ పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఒక మాఫియా ముఠాగా పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబును ప్రజలు చీ కొట్టినా బుద్ధిరాలేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వెన్నతో పెట్టిన విద్య..
ఈ మేరకు దేశంలో అన్ని వ్యవస్థలను శాసించడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటు అని సజ్జల అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అలాగే చంద్ర బాబు అంటే గుర్తొచ్చేది వ్యవస్థలను మేనేజ్ చేయడమే. మీడియాను అడ్డం పట్టుకునే ఉవ్వెత్తున అసత్య ప్రచారాలు చేయడంలో దిట్టా. అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం చంద్ర బాబుకు అలవాటే. పార్టీని మాఫియా ముఠాలాగ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు. నలభై ఏళ్ల అనుభవం తరువాత చంద్ర బాబు చేసిన అవినీతి ఆయనకు మిగిలింది. రాజకీయ జీవితంలో సమాంతరంగా అవినీతిని బ్యాలెన్స్ చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Railway Property : ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!

ప్రజలు చీ కొట్టి తరిమేసినా..
ఇక కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర నిధుల వరకు ఎదో ఒక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి కూడా ఒక పెద్ద స్కాం.
ప్రజలు చీ కొట్టి తరిమివేసిన తన వైఖరిని చంద్రబాబు ఇప్పటికీ మార్చుకోలేదు. ఎవరు ఎలా వచ్చినా ఎంత మంది వచ్చినా ఎన్నికల యుద్దానికి సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ప్రకటించారు. బీజేపీ, జనసేనతో పాటు నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు జత కట్టారు. అవుట్ సోర్సింగ్ లాగ అన్ని పార్టీల మద్దతు కూడా గట్టుకొని పొత్తులతో వస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్యక్షురాలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. వైఎస్ షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడ నుంచి వస్తుందో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారని చెప్పారు. అట్టడుగున ఉన్న అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారంటూ ఈసారి కూడా వైసీపీ (YCP) ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు