TDP vs YCP: అమెరికా సర్వర్లతో 40 లక్షల దొంగ ఓట్లు.. టీడీపీపై వైసీపీ ఎంపీల సంచలన ఆరోపణలు..

అమెరికా సర్వర్లతో 40 లక్షల దొంగ ఓట్లు చేర్పించారంటూ టీడీపీపై వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీలు.

New Update
Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత

Andhra Pradesh: టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ(TDP) నేతలు 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్పించారని వైసీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(CEC) కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారని, పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారన్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది.. అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల దాడులు..

దొంగ ఓట్లను తొలగిస్తున్న బూత్ లెవల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులు బీఎల్వోలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని తెలిపారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ కోనేరు పేరిట ఒక ఫిర్యాదు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కి ఫి చేశారని.. ఒక 10 లక్షల ఓటర్లు నకిలీ ఓటర్లు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెరిఫై చేసి 1-2% తేడాలు మినహా అంతా కరెక్ట్ అని తేల్చారన్నారు. టీడీపీ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆరోపించారు. బూత్ లెవెల్ ఏజెంట్ మాత్రమే ఫిర్యాదు చేసేలా ఉండాలి. సురేష్ కోనేరు వంటి వ్యక్తులు ఇచ్చే బల్క్ ఫిర్యాదులపై సమయం వృథా చేసుకోవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. ఓకే ఐడీతో రెండు మూడు ఓట్లు నమోదు అయ్యాయి. ఆధార్ సీడింగ్ చేస్తే ఎలాంటి దొంగ ఓట్లు తొలగించవచ్చు. ఇదే విషయాన్ని మేము ఈసీ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు.

ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు​ మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారిగా లేక ఎన్నికల కమిషన్ అధికారిగా ప్రజలను మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారన్నారు. బాబు ష్యూరిటీ పేరుతో ఆ కుటుంబాలకు హామీ కార్డులు ఇస్తున్నారని.. అలాగే దొంగ ఓట్లు కూడా చేర్చుతున్నారు. ఒక పేరులో స్పెల్లింగ్ కాస్త మార్చి మరలా మరలా పేర్లు నమోదు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణలో నివసిస్తున్న వారి పేర్లను కూడా ఇక్కడ చేర్చుతున్నారు. తెలంగాణ ఓటర్స్ ఏపీలో ఓటు వేయించేలా ఒక డ్రైవ్ నిర్వహించే ప్రయత్నం టీడీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు.

టీడీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ "మై పార్టీ డాష్ బోర్డ్" యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అనే విషయాన్ని ఈసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఈ డాటాను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సర్వర్ లో భద్రపరుస్తున్నారని.. సేవా మిత్ర పేరుతో గతంలో ఇలాగే డేటా సేకరించారు. వారిపై కేసులు కూడా నమోదు చేశామని గుర్తు చేశారు. ఒక వ్యక్తి కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. మోడల్ కోడ్ ఉల్లంఘించేలా అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి 30 ఇళ్లకు ఒక టీడీపీ కార్యకర్తను నియమిస్తున్నారని.. ఆ కార్యకర్త మానిఫెస్టో రూపొందించే కసరత్తు ఆ 30 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి లండన్ సర్వర్ లో భద్రపరుస్తున్నారన్నారు.

Also Read:

ఏంది వర్మా.. పవన్‌ను అంత మాట అనేశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో మరి..!

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు..

Advertisment
తాజా కథనాలు