చంద్రబాబు రూట్ మ్యాప్ ఇదే..ఆయన ఎలా వెళ్లనున్నారంటే!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

New Update
చంద్రబాబు రూట్ మ్యాప్ ఇదే..ఆయన ఎలా వెళ్లనున్నారంటే!

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. ఈ క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి భారీ ఊరేగింపుతో విజయవాడ తీసుకుని వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ నుంచి చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను టీడీపీ ఇప్పటికే సిద్దం చేసింది.

Also read: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..

దీని గురించి టీడీపీ సీనియర్‌ నాయకులతో కలిసి నారా లోకేశ్‌ చర్చలు జరుపుతున్నారు. ముందుగా చంద్రబాబు రాజమండ్రి నుంచి వేమగిరి( రాజమండ్రి, అనపర్తి) చేరుకుంటారు. రావులపాలెం (కొత్తపేట, మండపేట), అక్కడ నుంచి పెరవలి (నిడదవోలు) కి చేరుకుంటారు.

అక్కడ నుంచి తణుకు (తణుకు, ఆచంట) , తాడేపల్లిగూడెం ( తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలంలోని గోపాలపురం మీదుగా...భీమడోలు (ఉంగటూరు, ద్వారకా తిరుమల మండలంలోని గోపాలపురం) చేరుకుంటారు. దెందులూరు , ఏలూరు , హనుమాన్‌ జంక్షన్‌ ( గన్నవరం, నూజివీడు, గుడివాడ) గన్నవరం మీదుగా విజయవాడకు చంద్రబాబు వెళ్లనున్నారు.

Also read: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే

చంద్రబాబు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది.

దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు