జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ..

New Update
జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితి గతులపై మంగళవారం పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికీ పరిహారం అందించకపోగా.. లబ్దిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే, ఏపీలో తగ్గిపోయింది.. నా సంకల్పానికి ఎవరూ అడ్డు రాలేరు.. పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే వరకు ఆగేది లేదని చెప్పారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించిందని, శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు చంద్రబాబు.

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ అని అన్నారు. ఎన్ని తప్పులైనా చేసి ఎదురుదాడి చేస్తే భయపడి మౌనంగా ఉంటామా? అని అన్నారు. కొంతమంది సిగ్గులేకుండా విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని, గ్రేట్ మేధావులు అని చెప్పుకునేవారు, ఇప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా? లేక ఇంకా అథఃపాతాళానికి నెట్టేస్తారో ఆలోచించుకోవాలన్నారు.

పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీపై సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరుగుతూ ఎదురుదాడి చేయటం జాతి ద్రోహమేనని చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోదావరి ప్లడ్ బ్యాంక్స్ ఆయకట్టు కనీసం రూ.7 కోట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని, 2022లో గోదావరి ఫ్లడ్ బ్యాంకులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని జలవనరుల శాఖ చెప్పి ఏడాది దాటినా ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయని, గోదావరి డెల్టా ఆధునికరణ 5 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. పోలవరంతో పాటు చింతలపూడి లిఫ్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రం సుభిక్షమయ్యేదన్నారు. ఈ ప్రభుత్వం రావడంతో చెప్పలేనంత నష్టం జరిగిందని.. పోలవరం ఒక చరిత్ర.. ఒక కల.. అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపం:

• తొలిసారి బ్రిటీష్ ప్రభుత్వంలో 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పోలవరం నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. 1942 అక్టోటర్ 10న బ్రిటీష్ ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన కోసం జీవోనెం-3704 PW విడుదల చేసింది.
• రకరకాల ప్రతిపాదనలు, పరిశీలనల అనంతరం 340 టీఎంసీల నుంచి 836 టీఎంసీలకు పెంచారు. ఆ స్థాయిలో నీటిని సేకరించాలని ఆలోచించారు. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలు పరిశీలించి, చివరకు ఇప్పుడు నిర్మించిన ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 1947-48లో పోలవరం ప్రాజెక్ట్ విలువ రూ.129 కోట్లుగా అంచనావేసి, రామపాద సాగర్ గా ప్రాజెక్టుకి నామకరణం చేశారు.
• ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 194 టీంసీలు. మరో 200 టీఎంసీలు అదనంగా వినియోగించుకునే అవకాశముంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 28.50 లక్షల జనాభాకు తాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి. వాటర్ టూరిజం అభివృద్ధితో పాటు పరిశ్రమలకు నీరు అందించవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు