Chandrababu Press Meet : ఎన్నికల్లో (Elections) విజయం సాధించిన చంద్రబాబు (Chandrababu) ఈరోజు తొలిసారి మీడియా ముందు వచ్చారు. జగన్ (YS Jagan) పై నిప్పులు చెరిగారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగన్ లాంటి రాక్షస పాలన చూడలేదని అన్నారు. గత ఐదేళ్లలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.ఏపీ భవిష్యత్ కోసం పనిచేస్తామని.. తమను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని.. ఎవరు శాశ్వతం కాదని అన్నారు. దేశం శాశ్వతం, రాజకీయాలు కాదని పేర్కొన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు అని అన్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీకి 45.6 శాతం ఓట్లు వచ్చాయని.. వైసీపీకి 39.35 శాతం ఓట్లు పోలయ్యాయని అన్నారు. మొత్తంగా కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. పక్క రాష్ట్రాలకు కూలికి వెళ్లిన ప్రజలు కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నారు. ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న అని.. వచ్చాక అన్నిట్టి గురించి తాను వివరంగాచెప్తానని అన్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు ఏపీని కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడిచారని.. పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : పేరు మార్చుకున్న కాపు నేత ముద్రగడ!