Sankranti : భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్..

మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. ఈ సంబరాలకు టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

New Update
Sankranti : భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్..

Sankranti Sambaralu : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) సంబరాలు అంబరాన్ని అంటాయి. మందడం గ్రామంలో భోగి(Bogi) మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు, జనసేన నేతలు భారీగా తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ తో కలిసి భోగి మంటలు అంటించారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను భోగి మంటల్లో తగలబెట్టారు చంద్రబాబు, పవన్. టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు చంద్రబాబు- పవన్ కళ్యాణ్.

అమరావతే రాజధాని: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతే(Amaravati) ఉంటుందని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే సీఎం జగన్(CM Jagan) అజెండా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా కొనసాగిస్తామన్నారు.

ఇవాళ్టి నుంచి 87 రోజులే.. వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.. లెక్క పెట్టుకోండి అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని విమర్శలు చేశారు. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోందని పేర్కొన్నారు. ఇక్కడే రాజధాని ఉంటుందని టీడీపీ - జనసేన భరోసా ఇస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి రోజున అందరు ఆనందంగా పండుగలు జరుపుకుంటే అంగన్వాడీలను రోడ్డున పడేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కలిపించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. యునతకు ఉపాధి కల్పించేలా టీడీపీ - జనసేన పార్టీ భరోసా ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత జనసేన టీడీపీ పార్టీలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : మళ్ళీ బంగారం ధరల మోత.. ఈరోజు ఎంత పెరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు