TDP Ayyanna : '420 జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు' సీఎం జగన్ @420 కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి అయ్యన్న సెటైరికల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. జగన్ మీద 13 సీబీఐ కేసులు..9 ఈడీ కేసులు..ఇతర కేసులు 8 ఉన్నాయని అందుకే జగన్ ను దొంగ, కేటుగాడు అంటానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 21 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP Ayyanna Birthday Wishes To CM Jagan : విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) ఏపీ సీఎం జగన్ కు సెటైరికల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. సీఎం జగన్(CM Jagan) @420 కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని చురకలు వేశారు. అయితే, ఆయన జగన్ కు ఎందుకు అలా విషెస్ తెలిపారనేది వివరించారు. జగన్ మీద సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కనుక నేను జగన్ ను దొంగ అని అంటానని ఎద్దెవ చేశారు. జగన్ మీద 13 సీబీఐ కేసులు..9 ఈడీ కేసులు..ఇతర కేసులు 8 ఉన్నాయని తెలిపారు. ఇన్ని కేసులున్నాయి కాబట్టి.. జగన్ ను నేను దొంగ, కేటుగాడు అంటానని వివరించారు.ఈ క్రమంలో సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్విట్ లో పోస్ట్ చేశారు. Also Read: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా? CM వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి Birthday అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత… — Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 21, 2023 'CM వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి Birthday అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా? Birthday పేరుతో ఒక్క రోజులో 100 కోట్లు కొట్టేసిన ఏకైక CM మీరే. పుట్టిన రోజును సైతం ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేసుకుంటారు కాబట్టే.. ముఖ్యమంత్రి గా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్దతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ'. జగన్ సీఎం గా ఉన్న ఆఖరి మూడు నెలలు అయినా..మంచి పరిపాలన అందించాలని కోరుతున్నాని ఆశభావం వ్యక్తం చేశారు. గూగుల్ లో 420 సీఎం అని కొడితే జగన్ మోహన్ రెడ్డి అని వస్తుందని ఎద్దెవ చేశారు. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే తెలుగు వారు అందరూ సిగ్గుపడాల్సి వస్తుందని కౌంటర్లు వేశారు. Also Read: జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు, పవన్.! #andhra-pradesh #ap-cm-jagan #tdp-ayyanna-patradu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి