ఫిషింగ్‌ హర్బర్‌ ప్రమాదంలో బోట్లు కోల్పోయిన వారికి టీడీపీ ఆర్థిక సాయం..

వైజాగ్ ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పాక్షికంగా బోట్లు పాడైపోయినవారికి వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున అందిస్తామన్నారు.

New Update
ఫిషింగ్‌ హర్బర్‌ ప్రమాదంలో బోట్లు కోల్పోయిన వారికి టీడీపీ ఆర్థిక సాయం..

ఇటీవల విశాఖపట్నంలోని ఫిషింగ్ హర్బర్‌లో అగ్నిప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలలో దాదాపు 60 నుంచి 70 బోట్లు మంటల్లో కాలిపోయాయి. ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ సర్కార్‌ ఘటనపై విచారణకు ఆదేశించింది. తొలుత ఈ అగ్నిప్రమాదనికి కారణం యూట్యూబర్‌ నాని అని అనుమంచిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే చివరికి ఈ ప్రమాదానికి అతనికి సంబంధం లేదని తెలియడంతో లోకల్‌ బాయ్‌ నానిని విడిచిపెట్టారు. అయితే బోటు కాలిపోయిన మత్స్యకారుల బాధితులకు 80 శాతం ఆర్థిక సాయం చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థికం సాయం చేసేందుకు టీడీపీ కూడా ముందుకొచ్చింది.

Also Read: చెప్పే దమ్ముందా?.. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్

ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయినవారికి వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనున్నామని పేర్కొన్నారు. అయితే బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో అధికార ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శలు చేశారు. చేసే సాయానికి కూడా అంతశాతం..ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించిందంటూ మండిపడ్డారు. బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్!

Advertisment
తాజా కథనాలు