TDP: అందరం కలిసి పని చేద్దాం: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌!

పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు.అందరం కలిసి, అందర్ని కలుపుకుంటూ పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అలా చేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని వివరించారు.

TDP: అందరం కలిసి పని చేద్దాం: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌!
New Update

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ తెనాలిలో టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆయన శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన తరువాత ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని ఆయన అన్నారు.

అందరం కలిసి, అందర్ని కలుపుకుంటూ పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అలా చేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని వివరించారు. టీడీపీ ఎన్నికల్లో ఏదోక ప్లేస్ లో సీటు వస్తుందని భావించిన ఆయనకు నిరాశే ఎదురయ్యింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతి చోటా సర్వే అనుకూలంగా ఉన్నప్పటికీ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు సీటు బోడె కు ఇవ్వడం న్యాయమే అని ఆయన అన్నారు.

ఆఖరి నిమిషం వరకు కూడా పోరాడాలనే భావనతో సీటు కోసం ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. నా వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని ఆలపాటి అన్నారు. తన నాయకత్వం అవసరం లేదని కార్యకర్తలు భావిస్తే తప్పుకుంటానని ప్రకటించారు.

Also read: ఒంటిమిట్ట లో విషాదం..ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య!

#vijayawada #elections #alapati #tdp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి