Tata Steel : 3 వేల మందికి ' టాటా ' బైబై..!

త్వరలో టాటా కంపెనీ నుంచి 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. టాటా స్టీల్‌ తన బ్రిటన్‌ యూనిట్‌ లో ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. టాటా స్టీల్‌ తన పోర్ట్‌ టాల్బోట్‌ స్టీల్ వర్క్స్‌ యూనిట్‌ లో రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లను మూసివేయనున్నట్లు తెలిపింది.

Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!
New Update

Tata Lay Offs : కొత్త ఏడాది మొదలైనప్పటికీ ఉద్యోగుల కోతలు(Lay Offs) మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే దిగ్గజ టెక్‌ కంపెనీలు(Tech Companies) గడిచిన 18 రోజుల్లో సుమారు 7,500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటి వరకు టెక్‌ ప్రపంచంలో ఉన్న లేఆఫ్‌ లు ఇప్పుడు ఇతర రంగాలకు కూడా చేరడం ప్రారంభించాయి.

ప్రపంచాన్ని కొవిడ్‌(Covid) వణికించి వెళ్లిన తరువాత దాని ప్రభావం ఆర్థిక రంగం మీద తీవ్రంగా పడినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ లే ఆఫ్‌ ల జాబితాలోకి భారత ఉక్కు కంపెనీ టాటా స్టీల్‌(Tata Steel)  కూడా చేరింది. టాటా స్టీల్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టాటా స్టీల్‌ తన బ్రిటన్‌ యూనిట్‌ లో ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం.

దాదాపు 3 వేల మంది..

టాటా స్టీల్‌ తన పోర్ట్‌ టాల్బోట్‌ స్టీల్ వర్క్స్‌ యూనిట్‌ లో రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లను మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ యూనిట్‌ బ్రిటన్ లోని వేల్స్‌ లో ఉంది. రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లు మూతపడటం వల్ల టాటా కంపెనీకి చెందిన దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది.

అధికారిక సమాచారం రాలేదు..

దీంతో రానున్న రోజుల్లో 3 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం దీని గురించి ఇంకా ఏ విషయం ప్రకటించలేదు. ఉద్యోగుల తొలగింపుల గురించి కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. వర్కర్స్‌ యూనియన్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ లను మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు టాటా స్టీల్‌ వర్కర్స్‌ యూనియన్‌(Tata Steel Workers Union) తో సమావేశం కూడా ఏర్పాటు చేసింది. చాలా కాలం నుంచి ఈ యూనిట్‌ లో పని చేస్తున్న కార్మికులను తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నప్పటికీ అది ప్రస్తుతం అసాధ్యంగా మారుతోంది.

గతేడాది చివరిలో ఉద్యోగులను తొలగింపుల ప్రక్రియలో భాగంగా కంపెనీ ఆర్థిక సాయం అందించింది. గతేడాది చివర్లో ప్రభుత్వం యూనిట్‌ కు 500 మిలియన్‌ పౌండ్లు అంటే దాదాపు రూ. 5,300 కోట్ల సాయం చేసింది. అయితే ఆ సమయంలో 3000 మంది ఉద్యోగాలకు ముప్పు ఉందని ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

Also read : ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు సజీవ దహనం!

#employees #layoffs #tata-steel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe