Nano Car:  నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్..

ప్రపంచంలో అత్యంత చౌకైన కారు నానో. రతన్ టాటా కలల కారైన ఈ నానో ఇప్పుడు మనుగడలో లేదు. ఇప్పుడు మళ్ళీ దీనిని ఎలక్ట్రిక్ వాహనంగా తీసుకురావాలని ఆలోచిస్తోంది టాటా గ్రూప్ . 2024 చివర్లో ఈ కార్ లాంఛ్ అవుతుందంటూ దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

Nano Car:  నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్..
New Update

TATA Nano EV Car: కేవలం లక్ష రూపాయలకే కారు అంటూ 2008వ సంవత్సరంలో వచ్చిన నానో కారు సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ఇదే. అప్పట్లో చాలా మంది ఈ కారు తెగ కొన్నారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇది కనుమరుగైపోయింది. టాటా గ్రూప్ కూడా దీని తయారీ ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ నానో కారు గురించి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. టాటా గ్రూప్ నానోను ఎలక్ట్రిక్ వెహికల్ గా తీసుకురానుందని సమాచారం. 2024 చివర్లో దీన్ని లాంఛ్ చేస్తారంటూ..ఈ ఈవీ కారుకు సంబంధించి ధర, మైలేజ్, ఫీచర్లు చక్కర్లు కొడుతున్నాయి.

నానో ఈవీ కారు ఫీచర్లు..

నానో ఈవీ కారు హ్యాచ్ బ్యాక్ మోడల్లోనే రానుంది. 17 kWh బ్యాటరీతో.. ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్ నడిచే కెపాసిటీతో వస్తుందని చెబుతున్నారు. R12 profile టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో 3.3 kW, AC ఛార్జర్‌, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంటున్నారు. ఇక ఈ కారు బేసిక్ ధర రూ. 5 లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదే కారు హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఎలక్ట్కిక్ కార్ల హవా నుడుస్తోంది. చాలా మంది ఈవీలను కొనడానికి ఇష్టం చూపిస్తున్నారు. అందుకే టాటా గ్రూప్ నానో ఈవీ కారును తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. 2025 నాటికి.. మార్కెట్ లో 10 రకాల ఫీచర్లతో ఈ టాటా నానో ఈవీ కార్లను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్..

#electric-car #tata #nano
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe