Nirnayam: ‘నిర్ణయం’.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందేశాత్మక చిత్రం!

తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషించిన సందేశాత్మక చిత్రం ‘నిర్ణయం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా థియేటర్ ప్రివ్యూను పూర్తి చేసుకున్న సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. సంజయ్ కుమార్, అంజలి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

New Update
Nirnayam: ‘నిర్ణయం’.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందేశాత్మక చిత్రం!

Tanikella Bharani: టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న సందేశాత్మక చిత్రం ‘నిర్ణయం’ (Nirnayam) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ నటులు తనికెళ్ల భరణి (Tanikella Bharani), ‘బాహుబలి’ హరిశ్చంద్ర రాయల, రఘునాథ రెడ్డి, జనార్ధన్ రావు (జెన్నీ) కీలక పాత్రల్లో నటించారు. జెన్నీ, పీవీ కృష్ణ ప్రసాద్ కలిసి డైరెక్ట్ చేశారు. సంజయ్ కుమార్, అంజలి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

ఇది కూడా చదవండి: Dinesh Karthik: ఆ రెండే నన్ను బాధించాయి.. ఒకటి ముంబై.. మరొకటి!

యూత్ ఫుల్ కంటెంట్..
యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు.. యువతకు, తల్లిదండ్రులకు సందేశాన్నిచ్చే చిత్రమిది. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లోని థియేటర్ లో ప్రివ్యూను కూడా పూర్తి చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి సినిమా యూనిట్ ను అభినందించారు. ఇక ఇదే టైటిల్ ‘నిర్ణయం’తో గతంలో అక్కినేని నాగార్జున యాక్షన్ ఫిల్మ్ వచ్చింది. మరీ ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఈ లేటెస్ట్ ఫిల్మ్ ఎలా అలరిస్తుందో చూడాలి. సుద్దాల అశోక్ తేజ, కుల శేఖర్ పాటలకు చక్కటి సాహిత్యం అందించారు. టీ సురేంద్ర రెడ్డి డీవోపీగా, శర్వాని శివకుమార్ ఎడిటర్ గా వర్క్ చేశారు. కృష్ణ సాయి సంగీతం అందించారు. అనంత్, విశ్వమోన్ ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే యూనిట్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు