Thandel Movie : 900 మంది డ్యాన్సర్లతో 'తండేల్' సాంగ్.. ఒక్క పాటకే అన్ని కోట్లు పెడుతున్నారా? నాగ చైతన్య ‘తండేల్' సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క పాటకోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల సమాచారం. సుమారు తొమ్మిదివందల మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 27 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Thandel Movie : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య - చందు మొండేటితో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్'. శ్రీకాకుళంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చైతూ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. Also Read : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే? కేవలం ఈ ఒక్క పాటకోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల సమాచారం. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడి జాతర్లలో రకరకాల వేషాలు వేసే పేరుమోసిన శ్రీకాకుళం కళాకారులు 65మందిని ఈ పాటకోసం మేకర్స్ రప్పించారు. సుమారు తొమ్మిదివందల మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ పాటలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కెరీర్లో ఒక పాటకు మూడు కోట్లు ఖర్చు చేయడం ఇదే తొలిసారి. #nagachaitanya #thandel-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి