మరో రెండు రోజులు వర్షాలు..రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

తమిళనాడులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌ గా మారింది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
మరో రెండు రోజులు వర్షాలు..రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

తమిళనాడు లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే చెన్నై నగరంతో పాటు అనేక జిల్లాల్లో ఉరుములుతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

తిరువల్లూర్‌, కంచీపురం, చెంగల్‌పట్టు, చెన్నై, టెంకాశీ, తూతుకుడై, తిరునెల్‌వెలి , కన్యాకుమారి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం చెన్నై, కంచీపురం, రాణిపేట్‌, చెంగల్‌పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మయిలదుతురై జిల్లాలు సహా పురుచ్చేరిలో అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.

తమిళనాడులో ఇప్పటికే అతి భారీ వర్షాలు పడుతుండడంతో చాలా ప్రదేశాల్లో స్కూళ్లకు, కాలేజీలకు , కొన్ని కార్యాలయాలకు సెలవులు ప్రకటిచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తుఫాన్‌ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
మచిలీపట్నం ఆదివారం తీరం దాటనున్నదని అధికారులు వివరించారు.

వాయుగుండం ప్రభావం వల్ల ఆదివారం ఉదయం నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణాలో కూడా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

Also read: కామారెడ్డిలో కేసీఆర్‌ ఘోర పరాజయం.. విజయం దిశగా కాంగ్రెస్..

Advertisment
Advertisment
తాజా కథనాలు