Viral News: రూ. 2000 పంపితే.. రూ. 753 కోట్లు వచ్చాయి.. లైఫ్ సెట్ అనుకున్నాడు.. అంతలోనే..

చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్‌లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది.

CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500?
New Update

Rs 753 Cr Found in Man Account: గత నెలలో తమిళనాడులోని ఓ క్యాబ్ డ్రైవర్(Driver) ఖాతాలో రూ. 9000 కోట్లు (Money) జమ అయిన విషయం తెలిసిందే. అయితే, అలా పడటమే ఆలస్యం.. అరగంటలో డబ్బు బ్యాంకు ఖాతాలోకి వాపస్ వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే, ఇప్పుడు కూడా అలాంటి ఘటనే పునారవృతం అయ్యింది. అది కూడా చెన్నైలోనే కావడం విశేషం. చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్‌లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది. ఎలాంటి లావాదేవీలు జరుగకుండా ఫ్రీజ్ చేసింది. వాస్తవానికి ఈ వ్యక్తి తన స్నేహితుడికి రూ. 2000 డిజిటల్ రూపంలో పంపించాడు. అయితే, ఆ డబ్బు పంపించిన కాసేపటికే.. రూ. 753 కోట్లు అతని అకౌంట్‌లోకి వచ్చాయి. దాంతో అతని బిత్తరపోయాడు.

అయితే, తమిళనాడులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు జరగడం మూడవసారి. గత నెలలో రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్‌ అకౌంట్‌లో రూ.9,000 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ తన మర్కంటైల్ బ్యాంక్‌కు తెలియజేయగా.. రూ.9 వేల కోట్లు తప్పుగా ఖాతాలోకి జమ అయినట్లు గుర్తించి.. ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అయితే, అప్పటికే రాజ్ కుమార్ తన స్నేహితుడికి రూ. 21 వేలు పంపించాడు. చివరకు బ్యాంకు అరగంట వ్యవధిలోనే డబ్బులన్నీ వెనక్కి తీసుకుంది. మిగిలిన రూ. 21 వేలు కూడా తిరిగి ఇచ్చేయాలంటూ సదరు వ్యక్తిని బ్యాంకు అధికారులు బెదిరించారు. దాంతో మ్యాటర్ లీక్ అవడంతో.. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అంగీకారం చేసుకున్నారు.

మరో కేసులో తంజావూరులో వెలుగు చూసింది. గణేశన్ అనే వ్యక్తి ఖాతాలో రూ.756 కోట్లు జమయ్యాయి. అక్టోబర్ 5న ఆన్‌లైన్ వ్యాలెట్ ద్వారా స్నేహితుడికి రూ. 1000 పంపించేందుకు ప్రయత్నించాడు. వాదేవీ రివర్స్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ బ్యాలెన్స్ చెక్ చేయగా రూ. 756 కోట్లు ఉన్నట్లు తేలింది. వెంటనే గణేశన్ ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లగా.. వారు డబ్బులను వాపస్ తీసుకున్నారు.

Also Read:

TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ

#tamil-nadu-news #chennai-news #money #753-cr-in-account
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe