విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష.. భార్యకు భారీ జరిమానా

తమిళనాడు డీఎంకే పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మద్రాసు కోర్టు షాక్ ఇచ్చింది. 1996-2001లో డీఎంకేలో మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసినట్లు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్యకు రూ. 50 లక్షల జరిమానా విధించింది.

New Update
విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష.. భార్యకు భారీ జరిమానా

తమిళనాడు డీఎంకే పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా పొన్ముడి ఫ్యామిలీకి మద్రాసు కోర్టు షాక్ ఇచ్చింది. అవినీతి చేసినట్లు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఈ కేసులో ఆయన భార్య, వారసులకు భారీ జరిమానా వేసింది.

ఈ మేరకు పొన్ముడి 1996-2001లో డీఎంకేలో మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాస్తులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు పొన్ముడి, ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) అధికారులు 2002లో కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమయ్యాడు. దీంతో జూన్‌ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు పొన్ముడి, అతని భార్య పీ విశాలాక్షిని నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 19న ఈ కేసును విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. పొన్ముడిని నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు తోసిపుచ్చి గురువారం కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి : పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను

ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో మంత్రి దంపతులను దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంకింద మంత్రి దంపతులను దోషులుగా తేల్చింది. మంత్రికి మూడేళ్లు సాధారణ జైలు శిక్షతోపాటు ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున జరిమానా విధించింది. అయితే శిక్షను తగ్గించాలని పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించగా.. శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం 30 రోజుల గడువు ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు