Vegetables : కూరగాయల ధరలకు రెక్కలు..కిలో టమాటా ఎంతో తెలుసా?

ప్రస్తుతం కూరగాయలన్నీ దాదాపు కిలో 80 రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు సుమారు 60 శాతం వరకు పెరిగాయి. మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కిలోలు దొరికిన టమాటా 80 నుంచి వంద రూపాయలు పలుకుతుంది.

New Update
Vegetables :  కూరగాయల ధరలకు రెక్కలు..కిలో టమాటా ఎంతో తెలుసా?

Vegetable Prices Hiked : కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు, మధ్య తరగతి కుటుంబాలకు (Middle Class Families) అందనంత దూరంలో కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే గతంలో రెండు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి ఇప్పుడు చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటున్నారు.పెరిగిన ధరలు సామాన్య కుటుంబాలకు పెనుభారంగా మారాయి.

హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవి (Summer) లో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. మరో వైపు వర్షాలతో వాతవరణ పరిస్థితిల్లో మార్పులు సంభవించడంతో కూరగాయలు కుళ్లిపోతున్నాయి. వ్యాపారస్తులు దిగుమతులు క్రమంగా తగ్గించారు. గతంతో పోలిస్తే తక్కువ కూరగాయల సాగు కూడా బాగా తగ్గింది.

మార్కెట్లో ప్రస్తుతం కూరగాయలన్నీ దాదాపు కిలో 80 రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు (Vegetables Prices) సుమారు 60 శాతం వరకు పెరిగాయి. మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కిలోలు దొరికిన టమాటా (Tomato) 80 నుంచి వంద రూపాయలు, మిర్చి 80 రూపాయలు, బీన్స్ 90 రూపాయలు, బెండ, బీర ఇతర కూరగాయలు కిలో 80 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు.

మరో రెండు మూడు నెలల వరకు కూరగాయలు ధరలు ఇలానే ఉంటాయని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. వర్షాకాలం కావడంతో కొత్త పంటలు వేస్తుండటంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై ప్రభావం చూపుతుందంటున్నారు వ్యాపారులు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని దీంతో కూరగాయలు ధరలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. పంటల దిగుబడి మొదలైతే రాబోయే రోజుల్లో ధరలు తగ్గుముఖం పడుతాయని అంతా అనుకుంటున్నారు.

Also read: వేదిక మీద కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్ అయిపోయిన బైడెన్.. !

Advertisment
తాజా కథనాలు