Tamannah : శివశక్తిగా మారిన తమన్నా.. 'ఓదెల 2' మేకింగ్ వీడియో వైరల్

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఓదెల 2' నుండి తమన్నా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో లో తమన్నా శివ శక్తి రూపంలోకి ఎలా మారిందో చూపించారు.

Tamannah : శివశక్తిగా మారిన తమన్నా.. 'ఓదెల 2' మేకింగ్ వీడియో వైరల్
New Update

Odela 2  - Introducing Tamannaah Shiva Shakti: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఓదెల 2'. రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ వంటి మాస్ సినిమాలని డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తమన్నా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా ఈ సినిమా నుండి తమన్నా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియో లో తమన్నా శివ శక్తి రూపంలోకి ఎలా మారిందో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటూ సినిమాపై మరింత హైప్ పెంచింది. కాగా ఈ సినిమాలో తమన్నా మహాదేవ్ కి పరామభక్తురాలిగా కనిపించనుంది. ఆమెతో పాటూ వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం కాశిలో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమాని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాంతారా మూవీ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని ఇదే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో కావాలయ్యా సాంగ్ తో తమన్నా నేషనల్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు లలో నటిస్తోంది.

Also Read : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. కారణం అదేనా?

#odela-2 #tamannah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి