/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T145937.913.jpg)
Vijay Varma - Tamannaah Relationship: తొలినాళ్లలో పీక్‌లో ఉన్న తమన్నా ఈ మధ్య కాలంలో చాలా పరిమిత సినిమాల్లోనే నటిస్తోంది. ఇటీవలే రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో (Jailer Movie) 'కావాలా' పాటలో డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించడం ప్రారంభించింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాత, నటుడు అయిన విజయ్ వర్మతో కలిసి తమన్నా 'లస్ట్ స్టోరీస్ 2' (Lust Stories 2) వెబ్ సిరీస్‌లో నటించింది. దీని తర్వాత, తమన్నా,విజయ్ వర్మ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ తర్వాత విజయ్ వర్మతో సన్నిహితంగా తమన్నా ఉండటంతో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో పుకార్లు వ్యాపించాయి. అయితే దీనిపై వారిద్దరూ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, నటుడు విజయ్ వర్మ ఈ విషయం గురించి తెరిచి, “తొలి రోజుల్లో ఇలాంటి వార్తలు చూసినప్పుడు మేము చాలా షాక్ అయ్యాము.
మా పర్సనల్ విషయాలు, రిలేషన్ షిప్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్లకు ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. తమన్నాకు నాకు ఉన్న బంధం అందమైనదని. సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ప్రచారాలను చూసి ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని విజయ్ వర్మ తెలిపారు.
Also Read: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..!