Phone Use: హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నారా? జాగ్రత్త.. ఫోన్‌లో చార్జింగ్ ఉంది కదా అని రోజు మొత్తం చాటింగ్, గంటల తరబడి ఫోన్‌లో సోది పెడుతుంటారు. అక్కర్లేని విషయాలను మాట్లాడుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌తో పాటు ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. గంటల తరబడి ఫోన్ మాట్లాడటం వల్ల మనకు తెలియకుండానే మన పర్సనల్ విషయాలను అవతలి వ్యక్తితో షేర్ చేసుకుంటాం. అంతేకాకుండా కుటుంబ విషయాలను పంచుకుంటాం. దీనిని అదునుగా తీసుకుని అవతలివారు సందర్భం వచ్చిన్నప్పుడు మనపై పగ తీర్చుకోవడానికి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో మన జీవితం నాశనం అవుతుందని అంటున్నారు. వీలైనంత వరకు ఫోన్‌లో అవసరం మేరకే మాట్లాడాలని, అనవసర విషయాలను ప్రస్తావనకు తీసుకురాకపోవడమే మంచిది. వర్క్ విషయంలో అయినా సరే ఒక లిమిట్‌లో ఉంటేనే ఉత్తమమని సూచిస్తున్నారు.
ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది?:
- ఫోన్ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అంతసేపు మాట్లాడితే చెవి సమస్యలు వస్తాయి. గంటల తరబడి చాటింగ్ చేయడం వల్ల కళ్లపై ప్రభావం పడుతుందని, సైట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి.
వీడియోలు చూడటం:
- ఫోన్‌లో డేటా ఉంది కదా అని నిరంతరం వీడియోలు చూస్తూ ఉంటారు. పనికిరాని పిచ్చిపిచ్చి వీడియోలు చూడటం వల్ల సమయం వృధా అవడమే కాకుండా మైండ్‌పైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాటింగ్:
- చాలా మంది చాటింగ్ మొదలుపెట్టారంటే గంటల తరబడి ఫోన్‌ను వదిలిపెట్టరు. అర్థరాత్రి 2, 3 గంటల వరకు స్నేహితులతో చాటింగ్ చేస్తూనే ఉంటారు. ఫోన్ మాట్లాడే అవకాశం ఉండకపోవడంతో ఇలా చేస్తుంటారు. అంతసమయం మేల్కొనడం వల్ల ఆరోగ్యం, మెదడు కూడా సరిగా పనిచేయదని చెబుతున్నారు.
వీడియో కాల్స్:
- కొందరు వీడియో కాల్స్ చేసుకుంటూ టైమ్‌పాస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. ఈ రోజుల్లో డీప్ ఫేక్ పేరుతో చాలా మంది సెలబ్రిటీల వీడియోలు మార్ఫింగ్‌కు గురవుతున్నాయి. ఇలా వీడియో కాల్స్ చేయడం వల్ల అలాంటి ప్రమాదాలతోపాటు బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా పాల్పడే అవకాశాలున్నాయి.
చార్జింగ్ పెట్టి మాట్లాడడం:
- కొందరు ఫోన్లలో బ్యాటరీ చివరికి వచ్చినా సరే వదిలిపెట్టరు. మాట్లాడుతూనే ఉంటారు. అంతేకాకుండా చార్జింగ్ పెట్టి మరీ మాట్లాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చార్జింగ్ పెట్టిన సమయంలో రేడియేషన్ అధికంగా విడుదల అవుతుందని హెచ్చరిస్తున్నారు.
రాత్రి ఫోన్ దూరంగా ఉంచాలి:
- రాత్రి సమయాలలో ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే పడుకునే ముందు ఫోన్‌ను దూరంగా ఉంచాలి. ఏదైనా అవసరం అయితే కాసేపు మాట్లాడి తర్వాత దూరంగా ఉంచడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే పరిణామాలు ఇవే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.