Rupay Credit Card: రూపే క్రెడిట్‌ కార్డ్‌ తీసుకుంటున్నారా.. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు మీ కోసమే!

మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు వీటి ఫీచర్లు, బెనిఫిట్స్, ఆఫర్లు చెక్ చేద్దాం.

New Update
Rupay Credit Card: రూపే క్రెడిట్‌ కార్డ్‌ తీసుకుంటున్నారా.. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు మీ కోసమే!

రోజువారీ జీవితంలో వివిధ రకాల పేమెంట్లు చేయడానికి క్రెడిట్‌ కార్డులు బెస్ట్‌ ఆప్షన్‌గా మారాయి. వడ్డీ లేకుండా క్రెడిట్‌ ఆప్షన్, పేమెంట్స్‌పై రివార్డులు అందిస్తుండటంతో ఎక్కువ మంది వీటిని వాడుతున్నారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు లేనప్పుడు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేయవచ్చు. వెల్‌కమ్‌ బోనస్‌లు, షాపింగ్‌ డిస్కౌంట్లు వీటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో రూపీ క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరుగుతోంది.

రూపే క్రెడిట్ కార్డులను వీసా, మాస్టర్ కార్డ్ తరహాలోనే భారతదేశం, విదేశాలలో వస్తువులు, సేవలకు పేమెంట్స్ కోసం వాడుకోవచ్చు. వీటిని యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకోవచ్చు. QR కోడ్‌ ద్వారా మర్చెంట్‌ అకౌంట్స్‌కు ఈజీగా పేమెంట్స్‌ చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వీటి ఫీచర్లు, బెనిఫిట్స్, ఆఫర్లు చెక్ చేద్దాం.

 IDFC ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ యాన్యువల్‌ ఫీజు రూ.499గా ఉంది. ఇది ఫ్యూయల్‌, EMI ట్రాన్సాక్షన్‌లపై క్యాష్‌బ్యాక్‌తో పాటుగా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌కు ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. ఫుడ్ డెలివరీ, కార్ రెంటల్స్ మరిన్నింటిపై డిస్కౌంట్లు అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్: యాక్సిస్‌ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.500. ఫ్యూయల్‌ ట్రాన్సాక్షన్‌లపై 100% క్యాష్‌బ్యాక్, ఫ్యూయల్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లు, సినిమా, డైనింగ్ ఖర్చులపై తగ్గింపులు ఉంటాయి. నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేస్తే యాన్యువల్‌ ఫీజు మాఫీ అవుతుంది.

SBI ట్రావెల్ క్రెడిట్ కార్డ్: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌కి ఏడాదికి రూ.499 యాన్యువల్‌ ఫీజు చెల్లించాలి. ఈ కార్డు వెల్‌కమ్‌ బెనిఫిట్స్‌, ట్రావెల్‌ బుకింగ్‌లపై డిస్కౌంట్లు, ఇతర ఖర్చులపై రివార్డ్ పాయింట్లు ఆఫర్‌ చేస్తుంది. ఫ్యూయల్‌ సర్‌చార్జ్ మినహాయింపు పొందవచ్చు.

SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్: ఈ క్రెడిట్‌ కార్డ్‌కి యాన్యువల్‌ ఫీజు కింద రూ.499 ఖర్చవుతుంది. అదనపు రివార్డ్ పాయింట్లు, స్సెసిఫిక్‌ కేటగిరీలపై రివార్డ్ పాయింట్లు, ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్ మినహాయింపు, యాన్యువల్ ఫీజుల మినహాయింపు పొందవచ్చు.

HDFC బ్యాంక్ IRCTC క్రెడిట్ కార్డ్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్‌కి సంవత్సరానికి రూ.500 యాన్యువల్‌ ఫీజు చెల్లించాలి. వెల్‌కమ్‌ గిఫ్ట్ వోచర్‌లు, రిటైల్, ట్రైన్‌ ట్రాన్సాక్షన్‌లపై రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ట్రైన్‌ టిక్కెట్లపై క్యాష్‌బ్యాక్, లాంజ్ యాక్సెస్‌పై డిస్కౌంట్‌, ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్ మాఫీ వంటి ప్రయోజనాలు ఉంటాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు