అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే

ఓటర్ అభ్యర్థులకు భారత ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలు సూచించింది. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ దొంగచాటున తీసుకెళ్లి సెల్ఫీలు తీస్తే కఠిన చర్యలుంటాయి. వెంటనే వారి ఓటు రద్దు చేసి 17-ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

New Update
అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే

Election Commission of India: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్(ECI) తెలిపింది. మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఇటీవలే వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌కు (Disabled Persons) తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును కల్పించగా ఇప్పుడు తెలంగాణలో దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఆ బీచ్ లో నగ్నంగా తిరుగుతా.. తెలుగు నటి పోస్ట్ వైరల్

అయితే ఇందుకోసం పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తుండగా ముఖ్యంగా సెల్ ఫోన్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. ఓటు వేస్తున్నప్పడు ఎవరైనా సెల్ఫీలు (Selfie) తీస్తే కఠిన చర్యలుంటాయని, వెంటనే వారి ఓటు రద్దు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎవరైనా ఇలా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తాం. పోలింగ్‌ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏ లో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవడం జరగదు.

అంధులకు సహాయకారిగా 18 ఏళ్లు దాటిన వారిని పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. అయితే అంధుడి ఓటును బహిరంగ పరచనని సహాయకుడు సంబంధిత పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటుహక్కు వినియోగించుకున్న వారిని మాత్రమే అంధుల సహాయకులుగా అనుమతిస్తామని ఈసీ మరోసారి స్పష్టం చేశారు.

Advertisment