Rajiv Gandhi Wedding Video: సాధారణంగా సినిమా స్టార్లు, రాజకీయ ప్రముఖుల పెళ్లి లేదా ఇతర శుభకార్యాల వీడియోలను చూసేందుకు జనాలు ఎక్కువగా మక్కువ చూపుతారు. 1968లో జరిగిన రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ వివాహం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 1968లో సోనియా మైనోతో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ వివాహానికి సంబంధించిన బ్లాక్ అండ్‌వైట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది.
21 ఏళ్ల సోనియా మైనోను పెళ్లి చేసుకున్నప్పుడు రాజీవ్‌గాంధీకి 23 ఏళ్లు. అసోసియేటెడ్ ప్రెస్ ఆర్కైవ్‌ల నుంచి ఈ వీడియోను @indianhistoryposts అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్ట్‌ను మళ్లీ షేర్ చేశారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ వివాహానికి సంబంధించిన బ్లాక్ అండ్‌వైట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది.న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రోడ్ నెంబర్ 1లోని ఇందిరాగాంధీ నివాసంలోని తోట వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోదరి విజయ లక్ష్మి పండిట్, సంజయ్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రాజీవ్ గాంధీ పెళ్లికి పింక్ తలపాగాతో క్రీమ్ సిల్క్ పాటియాలా అచ్కాన్ చూరిదార్ ధరించారని, సోనియా లేత గులాబీ ఖాదీ చీరను ధరించారని ఓ పుస్తకంలో రాశారు. పెళ్లి తర్వాత రోజు అశోక్ హోటల్‌లో పార్సీ, కాశ్మీరీ, ఇటాలియన్ వంటకాలతో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ తొలిసారిగా సోనియాను కేంబ్రిడ్జిలో కలిశారు.
అయితే.. ఈ వీడియోను తాజాగా వీక్షించిన నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ సోనియా భారతీయ సంస్కృతిని ఎంత చక్కగా పాటిస్తుందో అని కామెంట్ చేస్తే మరొకరు స్పందిస్తూ ఇందిరా గాంధీ ఒక సాధారణ భారతీయ తల్లిలా ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి, అందుకే ఇందిరా అంటే తనకు ఎంతో అభిమానం అని రాసుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: ఈ పెద్దపులి సాహాసం చూస్తే మతి పోవాల్సిందే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.