షర్మిల వెంటే నా ప్రయాణం.. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే షాక్
షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
CM Jagan: ఆ 50 మందికి షాక్.. రేపు సీఎం జగన్ కీలక ప్రకటన?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ లిస్టులో 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు వైసీపీ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్.
Andhra Pradesh: సీఎం జగన్తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో కలిశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది.
సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా.. వైసీపీలో అసలేం జరుగుతోంది?
సీఎం జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరుకాకపోవడం చర్చనియాంశమైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Big Breaking: వైసీపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఎప్పుడంటే?
సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో 48 గంటల్లో పూర్తి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల వివరాలను రీజనల్ కో-ఆర్డినేటర్లకు వివరించిన జగన్ క్షేత్ర స్థాయిలో నేతల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
మరికొన్ని నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి చేసింది ఏమి లేదని అన్నారు. జగన్ లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు.
ఆయన సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సొంత చెల్లి, తల్లితో కూడా ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పైగా ఇప్పుడు ఆడుకుందాం అంధ్రా అంటూ పిలుపునిస్తున్నారని బండారు విమర్శించారు.
Vangaveeti Narendra: రంగాను చంపింది వాళ్లే.. వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణ
వంగవీటి మోహన రంగాను చంపిన పార్టీ టీడీపీ అని ఆయన సోదరుడి కుమారుడు నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో నాయకత్వ లోపం కారణంగా రంగా అభిమానులు కొందరు టీడీపీలో వెళ్లారన్నారు. కానీ వారంతా ఇప్పుడు మళ్లీ తన వద్దకు వస్తున్నారని చెప్పారు.