Mudragada: టార్గెట్ జనసేన.. వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న చర్చ సాగుతోంది. ముద్రగడ కొడుకు చల్లారావును కాకినాడ ఎంపీ లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.