ముందు ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు.