నిన్నటి దాకా మోడీపై మొరిగిన సీఎంలు ఇప్పుడు.... సీపీఐ నారాయణ ఫైర్...!
వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.