ప్రాణహాని ఉందని డీజీపీని కలిసిన పోసాని!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగళ్లు ఘటనలో తప్పేవరిదో ఇప్పటికే మీడియాలో చాలాసార్లు ప్రసారం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.
రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు.
చౌలురు మధుమతి కూడా తన సోదరుడు చౌలూరు రామకృష్ణా రెడ్డి బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఆమె కూడా సోదరుడిలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని అంటున్నారు. కంచుకోటలో టీడీపీని ఓడిస్తామని పేర్కొంటున్నారు.
ఏపీలో 35 సర్పంచ్ స్థానాలకు,245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కడప జిల్లా సుగమంచిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కించారు. పంచాయతీఎన్నికలు ఎలా సాగుతున్నాయంటే...
గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల.