YCP MLA: జగన్ నన్ను గుర్తించకపోవడం దురదృష్టం.!
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారని తెలిపారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఐఏఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద లేరని చెన్నై వెళ్లారని పోలీసులు చెప్పినప్పటికీ కూడా వారు రోడ్డు పై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలు జంప్ లు కొడుతున్నారు. ఇందులో భాంగానే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్...పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు.
రంగాని ఆనాటి టీడీపీ ప్రభుత్వమే చంపేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవులు శాశ్వతం కాదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ మేరకు స్థానికంగా వాట్సాప్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ తూర్పు టికెట్ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ మాకేం భయం లేదంటున్నారు మంత్రి అప్పలరాజు. అక్కడ ఇప్పటికే ఓ పీకే ఉన్నారని..ఇప్పుడు మరో పీకే చేరాడు..అంతే తప్ప అంతకు మించి ఏం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
రాజకీయ లబ్ధికోసం లోకేష్ మొక్కుబడి పాదయాత్ర చేశారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్నినాని. యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేష్ కు లేదని.. అప్పుడు పాదయాత్ర ఆపలేదు కానీ, చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం పాదయాత్ర ఆపేశారని మండిపడ్డారు.