Anakapalle: 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది'.. యువగళం పాదయాత్రపై వైసీపీ నేత కౌంటర్లు.!
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కౌంటర్లు వేశారు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్. యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చురకలు వేశారు.