Andhra Pradesh : వైసీపీలోకి కీలక నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు
టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు.
టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు.
మాజీ మంత్రి పేర్నినాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి బాబు ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. త్వరలో YS షర్మిల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెప్పారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగ జాతికి మేలు జరుగుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ జాతి భవిష్యత్తు కూటమి గెలుపుతో కూడుకున్నదని చెప్పారు. జగన్ తమ జాతిని దారుణంగా మోసం చేశారని, వైసీపీనీ ఓడించేవరకు వదిలిపెట్టమన్నారు.
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్ మాటల యుద్ధం ముదిరి ఈసీ వార్నింగ్ ఇచ్చే వరకూ వెళ్ళింది.
పోతిన మహేష్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో తన చేత్తో మరో పార్టీ జెండా మోయనని చెప్పిన మహేష్ తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు. జనసేన కోసం కష్టపడ్డ మహేష్ ఆ పార్టీలోనే చనిపోయాడన్నారు. ఇప్పుడు తనది పునర్జన్మని.. ఇష్టం వచ్చిన పార్టీ జెండా మోస్తానని తేల్చిచెప్పారు.
ఎన్నికల ముందు వైసీపీకి మరో పెద్ద షాక్ తగలనుందని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ పార్టీని వీడి వెళ్ళనున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్రకు ఆయన, తమ్ముడు శ్రీధర్ అందుకే డుమ్మా కొట్టారని అంటున్నారు.