YCP: లైటింగ్ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ సమన్వయంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు.
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
గ్జిట్ పోల్స్ సర్వేలో వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ చేసిన సర్వే అంత ఫేక్ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కి బుద్దా ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
AP: బ్యాలెట్ ఓటు విషయంలో సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడించనుంది. కాగా హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు. 106 సీట్లతో జగన్ సీఎం అవుతారని సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ అంటున్నారు. మరో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు ఒక్క సీటుతో అయినా వైసీపీదే విజయం అంటున్నారు.
అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన 'X' ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.