Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.అతను విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదనే షరతు విధించారు.
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
AP: జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ కు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు ఆయన లేఖ రాశారు. దీంతో రోశయ్య ఏ పార్టీలో చేరుతారనే అంశంపై చర్చ సాగుతోంది.
తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.