Kadapa: భార్యా పిల్లలను చంపేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే..!!
కడపలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కోపరేటివ్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తను సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కడప 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు హెచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది.