Weather: భయపెడుతున్న తుఫాన్..ఏపీ, తెలంగాణలో భారీ వర్షం పడుతుందా? చలి పెరుగుతుందా?
దక్షిణభారతదేశం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వాతావరణాన్ని ఐఎండీ పరిశీలిస్తోంది. కొంతమేర తుఫాన్ విస్తరించిందని..లక్షద్వీప్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్ లేదు. చలిమాత్రం పెరుగుతుందని వెల్లడించింది.