AP: 16 మంది పిల్లలకు డయేరియా.. విషయంగా పాప పరిస్థితి..!
విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో 16 మంది పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఓ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో 16 మంది పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఓ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
విజయనగరం జిల్లా విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రించేందుకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోత రానున్న రోజుల్లో యువతకి ముప్పు తప్పదన్నారు. విద్యార్థి దశలోనే డ్రగ్స్ పై అవగాహన ఉండాలన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించారంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటుపై స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించారు.
విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడుతున్నారు.
విజయనగరం జిల్లా మారిక గ్రామ గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. డోలి మోతలు వలన ప్రాణాలు కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.
కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న తమకు డి పట్టాలు కాకుండా కొండ పోడు పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకుల మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వారు టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉన్నారన్నారు.
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత అక్కడి ట్రాక్ ను వెంటనే పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నిన్నంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా జరిగాయి. దీంతో ఆ దిశగా వెళ్ళే చాలా రైళ్ళను ఆపేసారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈరోజు కూడా మరి కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.