IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్ వీడియో..!
భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్‌ను బాబర్‌కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్ అభిమానులకు ఎంతగానో నచ్చిందట!