కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.