Uttam Kumar Reddy: ఆ లెక్కలు తేల్చండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ సంచలన ఆదేశాలు
మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడం, ప్రాజెక్టు వ్యయం, ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు తదితర వివరాలను అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితితో పాటు పలు అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.