USA: వణికిస్తున్న ఫ్లూ.. 15 వేల మంది మృతి..
అమెరికాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 2 లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇందులో 15 వేల మంది మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 2 లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇందులో 15 వేల మంది మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను అనుకరించేలా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఫెడరల్ కమ్యూనికేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనలో వెల్లడించింది.
అమెరికాలో ఎనిమిదేళ్ల తర్వాత బ్లుబోనిక్ ప్లేగ్ వ్యాధి బయటపడటం కలకలం రేపింది. ఒరెగాన్ స్టేట్‌లో ఓ వ్యక్తికి తన పెంపుడు పిల్లి నుంచి ఈ ప్లేగ్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అమెరికాలో భారతీయులు మరణాలు ఎక్కువైపోతున్నాయి. గత పది రోజుల్లో ఇప్పటికి దాదాపు ఏడుగురు చనిపోయారు. తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మరణించారు.
సిరియా, ఇరాక్‌లో ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని అంతం కాదంటూ అమెరికా.. ఇరాన్‌ను హెచ్చరించిది. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దీన్ని ఖండిస్తోంది.
హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ఫీజును 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచినట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్, ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుమును కూడా పెంచినట్లు తెలిపింది.
హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది.
యూఎస్‌లోని జార్జియాలో 25ఏళ్ళ ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. తాను సహాయం చేసి తిండి పెట్టిన హోమ్‌లెస్ మ్యేనే అతన్ని సుత్తితో దారుణంగా బాదిమరీ చంపేశాడు. జనవరి 16నజరిగి5న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.