UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే..
సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు.