'శ్రీవారి సేవ' ఉచితం.. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి: టీటీడీ ఈవో
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని..