కలియుగ వైకుంఠ దైవం కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి శిలా తోరణం వరకు బారులు తీరారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తడంతో సర్వ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. చిన్న పిల్లలు ఉన్న వారు ఆదివారం ఉదయం స్వామి వారి దర్శనానికి రావాలని సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం
Translate this News: