TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం..వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన! టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 09 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలిపిరి(Alipiri) వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహా విశేష హోమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. టీటీడీలో 5 వేల మందికి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. అలాగే కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. Also read: బీజేపీ తొలి జాబితా విడుదల..64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయం పార్టీ..!! ఉద్యోగులు ఎవరైనా విధుల్లో మరణిస్తే వారికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు ఈఎస్ ఐ అందుకోని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కూడా ప్రవేశ పెడుతున్నట్లు తెలియజేశారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు 18 కోట్లు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. "నారాయణగిరిలో హోటల్, అన్నమయ్య భవన్లో హోటల్స్‌ను టూరిజం శాఖకు అప్పగిస్తాం.. ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తాం. వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తాం. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకువస్తామని చైర్మన్ వివరించారు. #chairman #bhumana-karunakar-reddy #salries #eo #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి