CM Jagan:నేడు విజయనగరానికి ఆంధ్ర సీఎం జగన్
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, మంత్రులు, సీఎం అందరూ స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆంధ్ర సీఎం జగన్ మృతులకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఈరోజు జగన్ విజయనగరం వెళ్ళనున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటూ...గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు.