Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తేదీ ఇదే.. ట్రాఫిక్‌పై కీలక అప్ డేట్
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడి సందడిగా ఉంది.