Tirupathi: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది.
రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను వెయ్యికి పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు.
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. దాంతోపాటూ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి కారులో తిరుమలకు ఆయన ప్రయాణించారు. ప్రతీ చోటా చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది.
మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలవనుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఐదుగురు సీఐలపై వేటు వేసింది. జగన్మోహన్రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను తిరుపతి నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది.
తిరుపతిలోని ఓ పోలింగ్ బూత్ అలంకరణ వివాదాలకు దారితీసింది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ అవుతోంది.